తిప్పతీగతో మధుమేహం పరార్.. కీళ్ల వాపుకు గుడ్ బై

సెల్వి

శనివారం, 10 ఆగస్టు 2024 (15:46 IST)
ఆయుర్వేదంలో తిప్పతీగ మూలికను అమృతం అంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. తిప్పతీగ రసం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. తిప్ప తీగలో కనిపించే అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తరచుగా దగ్గు, జలుబు, టాన్సిలిటిస్ వంటి ఏవైనా సాధారణ శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. 
 
మధుమేహం, చర్మవ్యాధులు, కొన్ని కీళ్ల వ్యాధులు, నులిపురుగులు, జ్వరం, దగ్గు మొదలైన వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తిప్పతీగ జ్యూస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. 
 
కీళ్ల వాపు, నొప్పి ఉంటే.. తిప్పతీగ వేర్ల కషాయాలను ప్రతిరోజూ తీసుకోవాలి. తిప్పతీగ శరీరంలో రోగ నిరోధకశక్తిని మెరుగుపర్చి అనేక వ్యాధులను నియంత్రిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు