పెళ్లిళ్ల సీజన్‌: సోనా స్విస్‌చే స్వర్ణ కలెక్షన్

శుక్రవారం, 7 నవంబరు 2008 (17:27 IST)
PR
వివాహ మహోత్సవం అనేది జీవితంలో ఒకేసారి జరుపుకునే మధుర జ్ఞాపకం లాంటి కార్యక్రమం. ఈ ఉద్విగ్న క్షణాలను నగలతో, ఆభరణాలతో అలంకరించుకుని గడిపేయాలని ఎవరి కుండదు మరి. ఈ అమర క్షణాలను చిరస్మరణీయ స్మృతులుగా మల్చుకుని మురిసిపోయేలా చేయడానికి సుప్రసిద్ధ ఆభరణాల సంస్థ స్వర్ణ కలెక్షన్ 24 కేరట్ బంగారంతో ప్రత్యేకంగా నగలను రూపొందించి రాబోయే పెళ్లిళ్ల సీజన్‌కు సిద్ధంచేసింది.

హైదరాబాద్ విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి నగరాలు, ఇతర పట్టణాలు ఈ సీజన్‌లో పెళ్ళిళ్లతో కలకలలాడుతుంటాయి. పెళ్లిళ్ల సీజన్‌లో వధూవరులను మిరుమిట్లు గొల్పేలా మల్చడానికి స్వర్ణ కలెక్షన్ పేరిట వివిధ ఆభరణాలను సోనా స్విస్ రూపొందించింది. 24 కేరట్ల బంగారు పుష్పాలతో కూడిన కేశాభరణాలు, 24 కేరట్ల పిన్ను, 24 కేరట్ల బంగారు గులాబీల పూలదండ వంటి వివిధ ఆభరణాలను చూపరులు నేత్రాలు జిగేల్మనేలా సోనా స్విస్ సంస్థ రూపొందించింది.

ఇంకా వైవిధ్యపూరితమైన పలు స్వర్ణ పుష్పాల కలెక్షన్‌ను కూడా ఈ పెళ్లిళ్ల సీజన్‌కు అందుబాటులో ఉంచింది. 24 కేరట్ల బంగరు పుష్పం, 24 కేరట్ల బంగారు పెళ్లి కార్డులు , 24 కేరట్ల బొకే, ఆర్ట్ డెకరేషన్ ఫ్రేములు వగైరా అద్భుతమైన కలెక్షన్ సోనా స్విస్ రూపొందించింది. ఇంకా సరస్వతి, లక్ష్మి, మరెందరో దేవతల 3డి ఫ్రేముల దివ్య కలెక్షన్ కూడా ఈ జాబితాలో ఉంది మరి.

సాంప్రదాయిక నైపుణ్యం, ఆధునిక 3డి టెక్నాలజీ మేళనంతో ప్రత్యేకంగా రూపొందించే ఆభరణాలకు సోనా స్విస్ పెట్టింది పేరు. వెయ్యికి 999.9 స్వచ్ఛతతో 24 కేరట్ల బంగారు రేకుతో కూడిన సోనా స్విస్ ఉత్పత్తులు లండన్, న్యూయార్క్‌లలోని ఆస్సే కార్యాలయాలలో సర్టిఫై చేయబడ్డాయి.

సోనా స్విస్ వెడ్డింగ్ కలెక్షన్ ప్రారంభించిన సందర్భంగా సంస్థకు చెందిన అనామిక చావల్ మాట్లాడుతూ తైవాన్‌లోని తమ ఫ్యాక్టరీలో 3డి టెక్నాలజీ పేటేంట్‌ సహాయంతో రూపొందించిన సోనా స్విస్ నగలు ఆకర్షణకు, గాంభీర్యానికి మారుపేరుగా నిలుస్తాయని చెప్పారు.

భారతీయ వధువు కుటుంబంలో పెళ్లి అనేది అత్యంత పెద్ద ఉత్సవమని ఆమె చెప్పారు. వివిధ రూపాల్లో తమ ఉత్పత్తులు ప్రపంచమంతటా పేరు పొందాయని పేర్కొన్నారు. అన్ని రకాల ఆదాయ వర్గాల వారికి ఇవి అందుబాటులో ఉంటున్నాయని ఆమె చెప్పారు.

వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ సోనాస్విస్ డాట్ కామ్ వెబ్‌సైట్‌ను చూడండి.

వెబ్దునియా పై చదవండి