పాప్ సంగీత రేరాణి బ్రిట్ని స్పియర్ తనకు సెక్స్ సింబల్‌గా ముద్రపడటం పరమ సంతోషంగా ఉంటోందని రాగాలు పోయింది. ఈ సంవత్సరం చిత్త చాంచల్యంతో ప్రజలకు దూరమైన బ్రిట్ని స్పియర్ మెల్లమెల్లగా కోలుకుని తిరిగి గాడిలో పడుతోంది. జనం తనను సెక్సీగా పిలుస్తున్న ప్రతిసారీ తనకు చెప్పలేనంత ఆనందంగా ఉంటుందని బ్రిట్ని పేర్కొంది.
తాను సెక్స్ ప్రతీకగా ఉన్నట్లుగా జనం భావిస్తుంటే ఎవరికయినా ఆనందం పరవళ్లు తొక్కుతుందని నొక్కి చెబుతోంది బ్రిట్ని. నువ్వు సెక్సీగా కనపడాలని ప్రయత్నించకుండా నీకు నీవుగా ఉన్నప్పుడే మరింత సెక్సీగా ఉంటావని ఆమె సుద్దులు చెబుతోంది. సెక్సీగా ఉండటం తన కిష్టం లేదని ఏ అమ్మాయి అయినా అంటోందంటే ఆమె అందమైన అబద్దం చెబుతున్నట్లే లెక్క అని బ్రిట్ని చెబుతుంది. మనమంతా సెక్సీగా కనిపించాలని ఫీలవుతుంటామని ఆమె ముక్తాయించింది కూడా.
26 ఏళ్లకే ఇద్దరు పిల్లల తల్లి అయిన బ్రిట్ని సెక్సీగా ఉండటానికి తానిష్టపడతానని చెప్పింది. అయితే తనను ఆదర్శప్రాయురాలిగా ఎవరయినా పేర్కొంటే చాలా ఇబ్బంది పడతానని, ఎందుకంటే సంవత్సరాలుగా తాను అనేక తప్పులు చేస్తూ వచ్చానని ఆమె నమ్రతగా చెబుతోంది.
నేను చాలా తప్పులే చేశాను. నేను తప్పు చేసినప్పుడు దాన్నే తిరిగి చేయమని టీనేజర్లకు తాను ఎన్నడూ సూచించను. నాకయితే రోల్ మోడల్‌గా ఉండాలనిపించదలచలేదు. బాధ్యతాయుత పాత్రలో ఉండటం తనకు ఇష్టముండదు. ఎందుకంటే నేను మనిషిని అంతే అని బ్రిట్నీ స్పియర్ అనుభవసారాన్ని రంగరించి చెబుతోంది మరి.