టమోటాలో దాగివున్న చిట్కాలు..?

శనివారం, 13 ఏప్రియల్ 2019 (16:39 IST)
టమోటాలు ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. టమోటాల్లో లికోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఒక సన్ స్క్రీన్‌లా పనిచేస్తుంది. బాడీకేర్ విషయంలో టమోటా ఆహార రూపంలో తీసుకోవడం లేదా టమోటా రసాన్నిచర్మానికి అప్లై చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. అలానే చర్మ రంధ్రాలను నివారించడానికి టమోటో జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం చేర్చి, రెగ్యులర్‌గా చర్మానికి అప్లై చేయడం ద్వారా చర్మ రంధ్రాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. 
 
మొటిమలు, మచ్చలు నివారించుకోవడానికి చాలా మంది అనేక విధాలుగా టెక్నిక్స్‌ను ఉపయోగిస్తారు. అయితే ఒక సారి టమోటను ట్రై చేసి చూడండి. బాడీకేర్‌లో టమోటాలను ఉపయోగించడంలో మొటిమలను నివారిస్తుంది. 
 
టమోటలో ఉన్న విటమిన్ ఎ, విటమిన్ సి చర్మ సంరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. టమోటాలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ సెల్యులార్ డ్యామేజ్‌తో పోరాడుతుంది. శరీరంలోని ప్రీరాడికల్స్‌ను నివారించడంతో చిన్న వయస్సులోనే ఏర్పడే వృద్ధాప్య ఛాయలను నివారిస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
కనుక ఈ వేసవి కాలంలో టమోటా జ్యూస్‌లు తీసుకోవడం, ఆహార పదార్థాల్లో టమోటాలు చేర్చుకోవడం వంటివి చేస్తుంటే.. చర్మం తాజాగా తయారవుతుంది. అలానే అప్పుడప్పుడూ టమోటా గుజ్జులో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే.. మొటిమ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు