చిన్నవయసులోనే రజస్వల అయితే చక్కెరవ్యాధి ఖాయమా?

శుక్రవారం, 16 నవంబరు 2018 (17:01 IST)
చాలామంది ఆడపిల్లలు శరీరంలో చోటుచేసుకునే మార్పులు, హర్మోన్ల ప్రభావం కారణంగా చిన్నవయసులోనే రజస్వల అవుతుంటారు. ఇది మంచిదే అయినప్పటికీ.. పెళ్ళయిన తర్వాత జెస్టినేషనల్ డయాబెటీస్ అంటే గర్భందాల్చే సమయంలో చక్కెరవ్యాధిబారినపడే అవకాశం ఉదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇటీవలికాలంలో ఈ తరహా మధుమేహ రోగగ్రస్థుల సంఖ్య పెరుగుతోందని, ఈ వ్యాధి వల్ల తల్లితో పాటు పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని క్వీన్స్‌లాండ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకురాలు డేనియెల్లి స్కోయెనేకర్ వెల్లడించారు. 
 
ఈపరిశోధన కోసం సుమారు నాలుగున్నర వేల మంది మహిళలను ఎంపిక చేసి ప్రశ్నించారు. వీరిలో అనేక మంది 11 యేళ్ళ వయసులో రజస్వల అయ్యామని, వివాహం తర్వాత మధుమేహం బారినపడినట్టు వెల్లడించారని పరిశోధకురాలు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు