సాధారణంగా చాలా మంది మహిళలు మూత్రాశయ సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, మూత్రం పోసేటపుడు మంట, మూత్రసంచి నిండినట్లు అనిపించడం, మూత్రం ఆగకపోవడం, మూత్రంలో రక్తం పడటం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. దీనికంతటికీ కారణం తగినంతగా నీరు తాగకపోవడమే.
అయితే, తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం మహిళలు రోజుకు లీటరున్నర నీళ్లు అదనంగా తాగితే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయని తేలింది. సాధారణం కంటే అదనంగా లీటరున్నర నీళ్లు తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఉండవని అమెరికాలోని టెక్సాస్ యూనివర్శిటీ పరిశోధకులు తేల్చారు.
మహిళల్లో సగం మంది మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నారని ప్రొఫెసర్ లోటన్ చెప్పారు. అధికంగా నీళ్లు తాగడం వల్ల మూత్రాశయంలో బాక్టీరియా తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మూత్రాశయ ఇన్ఫెక్షన్లను దూరం చేసేందుకు యాంటీబయాటిక్స్ వాడాలని పరిశోధకులు సూచించారు. అదనంగా నీళ్లు తాగడం వల్ల ఇన్ఫెక్షన్ సమస్యలుండవని పరిశోధకులు తేల్చి చెప్పారు.