కిరణ్‌బేడీపై తీసిన చిత్రానికి రెండు అవార్డులు

భారత తొలి మహిళా ఐపీఎస్ కిరణ్‌బేడీ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తీసిన "ఎస్ మేడమ్ సర్" అనే లఘు చిత్రానికి ప్రముఖ సాంతా బార్బరా అంతర్జాతీయ చిత్రోత్సవంలో రెండు పురస్కారాలు దక్కాయి.

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ దర్శకుడు మేగన్ డన్మైన్ తన సొంత నిర్మాణ సారధ్యంలో దర్శకత్వం చేపట్టిన ఈ చిత్రానికి పురస్కారంగా 1 లక్ష డాలర్లు, అలాగే సోషల్ జస్టిస్ పురస్కారంగా 2500డాలర్లతోబాటు పురస్కారం లభించింది.

ఈ లఘు చిత్రంలో కిరణ్ బేడీ జీవిత చరిత్ర, ఆమె ధైర్య సాహసాలు, ఇంకా తీహార్ జైల్లో ఖైదీల జీవితాలలో తీసుకువచ్చిన మార్పు, ఆమె తీసుకున్న నిర్ణయాలను కళ్లకు కట్టినట్టు చిత్రీకరించడం విశేషం. ఈ సందర్భంగా ఆ చిత్రానికి పురస్కారాలు రావడం ముంబై చలన చిత్ర పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

ముంబైలోని మురికి వాడల పరిస్థితిపై తీసిన చిత్రం స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌కు ఈ మధ్యనే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్న నేపథ్యంలోనే మరో భారతీయ చిత్రానికి పురస్కారాలు రావడం భారతీయ చిత్రసీమ ఉన్నతిని తెలియజేస్తోంది.

వెబ్దునియా పై చదవండి