న్యూయార్క్ సెనేటర్‌గా కరోలిన్ కెనడీ

మంగళవారం, 9 డిశెంబరు 2008 (16:26 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఒబామా బరాక్ తన కేబినెట్‌లో నియమించే వ్యక్తుల ఎంపికలో కూడా చరిత్ర సృష్టిస్తున్నారు. డెమాక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల బరిలో తలపడిన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ను విదేశాంగమంత్రిగా నియమించి సంచలనం సృష్టించిన ఒబామా ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ కుమార్తె కరోలన్‌ను న్యూయార్క్ సెనెటర్‌గా నియమించబోతున్నారు.

ప్రస్తుతం న్యూయార్క్ సెనేటర్‌గా ఉన్న హిల్లరీ క్లింటన్ అమెరికా విదేశాంగమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సెనేటర్‌గా రాజీనామా చేయనున్నారు. హిల్లరీ ఖాళీ చేయనున్న స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు కెన్నడీ కుమార్తె కరోలన్ కెన్నడీ ఎన్నికవబోతున్నారు.

ఇప్పటికే అమెరికన్లలో అత్యధికులు ఒబామాను అమెరికా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన కెనడీతో పోల్చుతున్నారు. కాగా ఆయన కుమార్తె కరోలిన్‌కు ఒబామా ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం. కరోలిన్ ప్రస్తుతం మన్‌హట్టన్‌లో లాయర్‌గా పనిచేస్తున్నారు. ఈమె ఒబామాకు సన్నిహితురాలు, సలహాదారుగా కూడా ఉంటున్నారు.

సెనేటర్‌గా హిల్లరీ వారసురాలిని నామినేట్ చేయవలసిన న్యూయార్క్ గవర్నర్ డేవిడ్ ఎ ప్యాటర్‌సన్తో కరోలిన్ ఇప్పటికే మాట్లాడారు. న్యూయార్క్ సెనేటర్ స్థానానికి గాను ఇతరుల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ఒబాగా సన్నిహితురాలిగా కరోలిన్ కెనడీ పేరే ప్రముఖంగా వినిపిస్తూండటం విశేషం

వెబ్దునియా పై చదవండి