తల్లిపాలు శిశువుకి అత్యంత సహజమైన పోషకాహారం. ఈ పాలు బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలను సరైన నిష్పత్తిలో సరఫరా చేస్తాయి. అలెర్జీలు, అనారోగ్యాల నుండి రక్షిస్తాయి. ఎన్నో వేల సంవత్సరాలుగా, మానవులతో పాటు ఇతర క్షీరదాలన్నీ తల్లి పాలివ్వడం ద్వారా తమ పిల్లలను పోషిస్తూ వస్తున్నాయి.
కానీ నేటికీ, తల్లి పాలివ్వడం చుట్టూ ఓ రకమైన ఇబ్బంది వుంది. అలా తల్లి పాలివ్వడం అనేది సమాజంలో తరచుగా ఆమోదయోగ్యం కానిదిగా కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇది బహిరంగ ప్రదేశంలో తల్లి బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు.
ఇక 10 మందిలో ఒకరికి మరో రకమైన అనుభవం ఏంటంటే... బిడ్డకు పాలు ఇచ్చేటపుడు ఎద భాగాన్ని కప్పుకుని పాలివ్వాలన్నది. అదనంగా, మరో ఎనిమిది శాతం మంది మహిళలు తమ బిడ్డకు పాలిచ్చేటప్పుడు అవాంఛిత లైంగిక దృష్టిని, అలాంటి వ్యాఖ్యల రూపంలో పొందారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులు మారాలనీ, తన బిడ్డకు పాలు ఇచ్చేటపుడు తల్లి ఎదుర్కొనే ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పెట్టాలని అంటున్నారు.