మారథాన్ విభాగంలో కెన్యా అథ్లెటిక్స్‌కు పసిడి పతకాలు!

న్యూఢిల్లీలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా చివరి రోజైన గురువారం జరిగిన మారథాన్ పోటీల్లో పురుషుల, మహిళల విభాగాల్లో కెన్యాకు చెందిన క్రీడారాలు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. పురుషుల మారథాన్ విభాగంలో 42.195 కిలోమీటర్ల దూరాన్ని కెన్యా అథ్లెట్ జాన్ ఎరికు కెలాయ్ రెండు గంటల 14 నిమిషాల 35 సెంకన్లలో పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ షెల్లీ 2:15:18 సెకన్లలో పూర్తి చేసి వెండి పతకాన్ని, కెన్యాకు చెందిన అమోస్ టిరోప్ మతౌ‌లు రజత పతకాన్ని గెలుచుకున్నారు.

ఈ పోటీలో పతకం ఆశలతో బరిలోకి దిగిన భారత అథ్లెటిక్స్ రామ్ సింగ్ యాదవ్, బినింగ్ లింగోఖాయ్‌లు ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో సరిపుచ్చుకున్నారు. ఇకపోతే.. మహిళల మారథాన్ విభాగంలోనూ కెన్యా అథ్లెట్ ఇరేనీ కోస్గీ బంగారు పతకాన్ని, ఇరెనీ మొగాకే వెండి పతకాన్ని, ఆస్ట్రేలియా అథ్లెట్ లిసా వైట్మాన్ రజతపతకాన్ని గెలుచుకున్నారు. ప్రపంచ రికార్డు అథ్లెట్ ఇంగ్లీష్ క్రీడాకారిణి పౌలా రెడ్‌క్లిఫె ఈ పోటీల నుంచి వైదొలగిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి