తన కెరీర్ లో మెమొరబుల్ ఇయర్ 2024కు సెండాఫ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ ఏడాది ఆమె "పుష్ప 2" వంటి బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్లలో బాలీవుడ్ లోనూ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది "పుష్ప 2". ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక పర్ ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. రష్మికకు ఎంతోమంది కొత్త అభిమానులను సంపాదించిపెట్టింది.