యోగాసనాలు వేసే ముందు...

బుధవారం, 20 ఫిబ్రవరి 2008 (20:30 IST)
1. యోగ సాధన చేయాలనుకునే విద్యార్ధులు ముందుగా యోగా నిపుణుల చేత సరైన తర్ఫీదును, సూచలను తీసుకోవాలి.
2. అదే సమయంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి. తొలిసారి యోగసాధన ప్రారంభించేవారు తప్పక వైద్యుడి అనుమతి తీసుకోవాలి. వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు కొన్ని రకాల వ్యాయామాలను చేయకూడదన్నదే దీని వెనక ఉన్న ఉద్ధేశ్యం. కాబట్టి ప్రారంభంలోనే వైద్యపరీక్షల్లో పాల్గొనడం అత్యంత ముఖ్యాంశం.

ఆమె/ అతను ప్రమాదకరమైన అనారోగ్యంతో బాధపడుతుంటే... అనారోగ్యం తాలూకు సమస్య నయమయిన తర్వాతనే ప్రణాళిక ప్రకారం యోగసాధనకు ఉపక్రమించాలి. క్లిస్టమైన యోగాసనాలను చేయు వారు.. అందులో హృద్రోగులు.. తప్పనిసరిగా సంబంధిత నిపుణుణ్ణి సంప్రదించిన తర్వాత యోగా థెరపిస్టు సాయంతో మాత్రమే ఆసనాలను చేయాలి.

సైనస్ వంటి వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్న వారికి.. తలక్రిందులుగా చేసే కొన్ని రకాల యోగాసనాలను సిఫార్సు చేయకపోవడమే మంచిది. రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్న వారైతే.. తొలుత రక్తపోటు సాధారణ స్థితికి చేరుకునేలా జాగ్రత్తలు చేసుకోవాలి.

ఇలాంటి తరహా సమస్యలను ఎదుర్కొంటున్న వారు తలక్రిందులుగా చేసే ఆసనాలను ఎట్టిపరిస్థితుల్లోను చేయకపోవడమే మంచిది. ఎందుకంటే తలక్రిందులుగా చేసే ఆసనాల స్థితిలో శరీరంలో రక్తం వేగంగా మెదడును చేరుతుంది. దీంతో సదరు వ్యక్తి శారీరక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటివారికి ఉత్తమమైనది శవాసనం. దీంతో పాటు మరికొన్ని రకాల ఆసనాలు ప్రత్యేకించి ఉన్నాయి. అయితే ఇవి కూడా యోగా థెరపిస్టు చేసే సూచనల మేరకే చేయవలసి ఉంటుంది. యోగావిధానాల్లోని కొన్ని రకాల ఆసనాల ద్వారా రోగాలనుంచి పూర్తిగా బయటపడవచ్చు.

బలహీనమైన యోగసాధకులు యోగసాధనకు ఉపక్రమించేముందు రెండు దశలను దాటవలసి ఉంటుంది. వాటిల్లో ఒకటి వైద్య సలహా.. రెండు ప్రాధమిక దశలో సరళమైన యోగాసనాలను చేసే విధంగా ప్రణాళిక చేసుకోవాలి. సరిపడే సామర్థ్యం పొందిన తర్వాతే క్లిస్టమైన యోగాసనాలను చేయవచ్చు. దేహంలోని అవయవాల పనితీరులో ఎటువంటి లోటుపాట్లు తలెత్తని పక్షంలో మరియు కీళ్లు మోకాళ్లు భుజాల వద్ద ఎటువంటి నొప్పులు లేనట్లైతే క్లిష్టమైన యోగాసనాలను అభ్యసించడానికి అర్హులవుతారు.

వెబ్దునియా పై చదవండి