60 ఏళ్లకే రిటైరవుతానన్న వైఎస్సార్

"ప్రభుత్వోద్యోగులే కాదు... రాజకీయ నాయకులూ 60 ఏళ్లకే పదవీ విరమణ చేయాలి.."2004 ఎన్నికలకు ముందు ఒక సందర్భంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా అన్నారట. ఈ మాటలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.

వృద్ధ నేతలు వైఎస్ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డారు. అయితే ఆ తర్వాత దానిని అందరూ మరిచిపోయారు. కానీ వైఎస్ మాత్రం తను చెప్పిన మాటలను మరిచిపోలేదు. మొన్న 2009 ఎన్నికలలో రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత తను 2004 ఎన్నికలకు ముందు చెప్పిన మాటలను విలేకరులకు గుర్తు చేశారట.

ఆ మాటలను గుర్తు చేస్తూనే ప్రస్తుతం తనకు 60 ఏళ్లు నిండినప్పటికీ మానసికంగా, భౌతికంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాననీ... ప్రజలు నా సేవలను కోరుకుంటున్నారు కనుక ముఖ్యమంత్రిగా మరోసారి పదవీబాధ్యతలను చేపట్టినట్లు వివరణ ఇచ్చుకున్నారట. కానీ విధి చాలా బలీయమైనది. ముఖ్యమంత్రి ఆకాంక్షను, ప్రజల కోరికను కాదని వైఎస్‌ను 60 ఏళ్లకే శాశ్వతంగా తిరిగిరాని లోకాలను తీసుకుని వెళ్లింది.

వెబ్దునియా పై చదవండి