02-07-2021 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజించినా...

శుక్రవారం, 2 జులై 2021 (04:00 IST)
మేషం : ఉపాధ్యాయ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. షాపింగులో నాణ్యతలు గమనించాలి. పెట్టుబడులకు తగిన సమయం కాదు. స్త్రీ ఆరోగ్యం విషయంలో కొంత మెళకువ వహించండి. దైవ దర్శనం చేయు సూచనలు కలవు. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఆహార విషయాలపై దృష్టిసారించడం అవసరం. 
 
వృషభం : గృహ నిర్మాణం, ఫర్నిచర్, కొనుగోలుకు నిధులు సమకూర్చుకొనుటలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ యత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది., బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు పలు విధాలుగా ఆలోచలు చేస్తుంటారు. 
 
మిథునం : స్టేషనరీ ప్రింటింగ్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తగలవు. రావలసిన ధనం చేతికి అందును. గతంలో వాయిదాపడిన పనులు మరల ప్రయత్నించడం వల్ల ముందుకుసాగును. ఆలయాలను సందర్శిస్తారు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి, పురోభివృద్ధికి తోడ్పడతాయి. 
 
కర్కాటకం : నూతన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కలవు. కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు చికాకు కలిగిస్తుంది. వ్యాపారాల్లో మార్పులు, చేర్పులకు ప్రయత్నిస్తారు. సమయానికి మిత్రులు సహకరించక పోవడంతో అసహనానికి గురవుతారు. 
 
సింహం : బ్యాంకింగ్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహన చోదకులకు చికాకులు ఎదురవుతాయి. పండ్లు, పూలు, కొబ్బరి, పానీయ చిరు వ్యాపారులకు లాభదాయకం. భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీపై అధికారుల ధోరణి మార్పు కనిపిస్తుంది. 
 
కన్య : ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెగలవలసి వస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలిస్తుంది. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభం అవగలవు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వారు మీ సహాయం అర్థిస్తారు. 
 
తుల : మీ శ్రీమతి  సలహా పాటించడం వల్ల చిన్నతనంగా భావించకండి. రాజకీయాలలో వారికి మంచి ఆందోళన అధికమవుతుంది. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాయిదాపడతాయి.
 
వృశ్చికం : స్త్రీలు గృహమునకు కావాల్సిన విలువైన వస్తువులకు ధనం బాగా ఖర్చు చేస్తారు. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ముఖ్యమైన పనుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. నిరుద్యోగులకు ఆశాజనకం. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. 
 
ధనస్సు : గృహములో మార్పులు, చేర్పులు అనుకూలం. స్త్రీలు పేరిట పొదుపు పథకాలు లాభిస్తాయి. కళ, క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి ఆదరణ లభిస్తుంది. దూర ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. కమ్యూనికేషన్, కంప్యూటర్, నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
మకరం : మీ మనసు మార్పును కోరుకుంటుంది. స్త్రీలకు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవహారాల పట్ల అప్రమత్తత అవసరం. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. 
 
కుంభం : మీరు చేయని కొన్ని పనులకు మీ మీద నిందలు మోపే అవకాశం ఉంది. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగంలో వారికి కలిసివచ్చే కాలం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఉన్నత విద్య, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో పలు విషయాలు చర్చిస్తారు. 
 
మీనం : మీ కోరికలు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. వృత్తులలో వారికి చికాకులు. వైద్యులకు లాభదాయకం. ఆడిటర్లకు మిశ్రమ ఫలితం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినా జారవిడుచుకుంటారు. స్పెక్యులేషన్ కలిసిరాగలదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు