Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

రామన్

సోమవారం, 16 డిశెంబరు 2024 (04:00 IST)
Daily Horoscope మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆలయాలు సందర్శిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు సానుకూలమవుతాయి. కార్యం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. ప్రణాళికలు వేసుకుంటారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. అనుకోని సంఘటనలెదురవుతాయి. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. అందరితోను సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. ఇంటి విషయాలు వెల్లడించవద్దు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రముఖులను ఆకట్టుకుంటారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆప్తులను కలుసుకుంటారు. పనులు అర్దాంతంగా ముగిస్తారు. కీలకపత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే అసహనం చెందుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పత్రాలు అందుకుంటారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా ఉండాలిజ. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు, అనుభవజ్ఞులను సంప్రదించండి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది, ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా అడుగులేస్తారు. మీ వ్యక్తిత్వానికి గౌరవం లభిస్తుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. నోటీసులు అందుకుంటారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. రోజువారీ ఖర్చులుంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెట్టండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బాధ్యతగా వ్యవహరించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఆశావహదృక్పధంతో మెలగండి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలతో సతమతమవుతారు. ఖర్చులు అధికం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు