21-05-22 శనివారం రాశిఫలాలు ... ఆంజనేయస్వామిని తమలపాకులతో..

శనివారం, 21 మే 2022 (04:00 IST)
మేషం :- మీ శ్రీమతి, సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. స్త్రీల ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృషభం :- పెద్దమొత్తం ధనం చెల్లింపులో ఆలోచన, తోటివారి సలహా తీసుకోవటం ఉత్తమం. దూర ప్రయాణా లక్ష్యం నెరవేరుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది. నిరుద్యోగులకు ప్రకటనలు పట్ల అవగాహన ముఖ్యం.
 
మిథునం :- పత్రికా సిబ్బందికి ఓర్పు, పునఃపరిశీలన ముఖ్యం. సాహస ప్రయత్నాలు విరమించండి. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆసరాగా నిలుస్తారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన స్కీములు మంచి ఫలితాలిస్తాయి. ఎదుటివారి వ్యాఖ్యలు మీపై తీవ్రంగా పనిచేస్తాయి.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలు చీటికి, మాటికి అసహనం, చికాకులు అధికమవుతాయి. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం.
 
సింహం :- విద్యార్థినులు ప్రేమ వ్యవహరాల్లో అతిగా వ్యవహరించటం వల్ల భంగపాటు తప్పదు. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రావలసిన బకాయిలు ముందువెనుకలుగానైనా అందుతాయి. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
కన్య :- దైవ సేవ, బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధికి పలు ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. గత అనుభవంతో వర్తమానంలో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు.
 
తుల :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పోగొట్టుకున్న పత్రాలకు నకళ్లు పొందుతారు. స్త్రీలు నూతన పరిచయస్తుల విషయంలో అప్రమత్తంగా మెలగటం క్షేమదాయకం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శించుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. శ్రమాధిక్యత మానసికాందోళన వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
వృశ్చికం :- బ్యాంకుల నుంచి పెద్దమొత్తం నగదు డ్రా చేసే విషయంలో జాగ్రత్త వహించండి. ప్రముఖుల ఇంటర్వ్యూకోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో చిన్న చిన్న తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది.
 
ధనస్సు :- వృత్తుల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన ప్రదేశ సందర్శనల వల్ల నూతన ఉత్సాహం కానరాగలదు. బ్యాంకింగ్ పనులలో అప్రమత్తంగా మెలగండి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు.
 
మకరం :- మీలో రూపుదిద్దుకున్న ఆలోచనలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళుకువ అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వృత్తులలో వారికి, చిన్నతరహా పరిశ్రమలలో వారికి చికాకులు తప్పవు. ప్రేమికులకు, పెద్దలకు మధ్య సమస్యలు ఎదురవుతాయి.
 
కుంభం :- కళ మొండివైఖరి వల్ల కుటుంబంలో కలహాలు, చికాకులు అధికమవుతాయి. స్త్రీలునరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. దూరప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం.
 
మీనం :- స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. గృహ వాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుట మంచిది. దంపతుల మధ్య నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు