జాతకం

సింహం
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ సహనానికి పరీక్షా సమయం. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నిదించవద్దు. అవకాశాలు చేజారిపోతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధన సమస్యలు ఎదురవుతాయి. సాయం చేసేందుకు అయినవారే సందేహిస్తారు. అవసరాలు వాయిదా పడుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతాన విషయంలో శుభ పరిణామాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ద అవసరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్ద మొత్తం సరకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత. సమయ పాలన ప్రధానం. కార్మికులకు ఆశాజనకం. పందాలు, జూదాల జోలికి పోవద్దు.