జాతకం


మేషం
వైద్య రంగాల వారు అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తుల ఓర్పు, పనితీరుకు పరీక్షా సమయం. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి ఆందోళన తప్పదు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది.
రాశిచక్ర అంచనాలు

వృషభం
ఆస్తి, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. మీ సంతానం పై చదువుల విషయాన్ని వారి ఇష్టానికే వదిలేయటం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధన సహాయం అర్థిస్తారు.
రాశిచక్ర అంచనాలు

మిథునం
రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావలసిన బెనఫిట్స్ విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు విరుద్ధంగా ఉంటాయి. విద్యార్ధులు విదేశీ విద్య కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని అందిపుచ్చోకోవటం మంచిది. బిల్లులు చెల్లిస్తారు.
రాశిచక్ర అంచనాలు

కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాల్లో హడావుడిగా ఉంటారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. సేవ, పుణ్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక, ఉమ్మడి వ్యవహారాలు సమర్ధంగా నిర్వహిస్తారు. బ్యాంక్ పనులు, ప్రయాణాల్లో మెలకువ వహించండి. భాగస్వామిక ఒప్పందాల్లో ఖచ్చితంగా వ్యవహరించండి.
రాశిచక్ర అంచనాలు

సింహం
పత్రిక, ప్రైవేట్ సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. భాగస్వామిక, సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. తక్షణం సద్వినియోగం చేసుకోండి. క్రయ విక్రయాలు ఫర్వాలేదనిపిస్తాయి.
రాశిచక్ర అంచనాలు

కన్య
మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీ సమర్ధతను గుర్తిస్తారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికం. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం.
రాశిచక్ర అంచనాలు

తుల
పత్రిక, వార్తా సంస్థల వారిక ఏకాగ్రత, కీలకమైన వార్తల ప్రచురణలో ఆలోచన అవసరం. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. విలాసాలు, గృహోపకరణాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
రాశిచక్ర అంచనాలు

వృశ్చికం
కలెక్షన్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, త్రిప్పుట వంటి చికాకులు తప్పవు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణలు చేయవలసి వస్తుంది. కొంత మంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ సంతానం చదువుల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఎల్.ఐ. సి పాలసీ, బ్యాంక్ డిపాజిట్ల ధనం చేతికందుతుంది.
రాశిచక్ర అంచనాలు

ధనస్సు
కలెక్షన్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, త్రిప్పుట వంటి చికాకులు తప్పవు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణలు చేయవలసి వస్తుంది. కొంత మంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ సంతానం చదువుల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఎల్.ఐ. సి పాలసీ, బ్యాంక్ డిపాజిట్ల ధనం చేతికందుతుంది.
రాశిచక్ర అంచనాలు

మకరం
నూతన పెట్టుబడులు, వ్యాపారాల అభివృద్ధికి చేసే వ్యయం ప్రస్తుతానికి వాయిదా వేయటం శ్రేయస్కరం. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. విద్యార్ధులకు టెక్నికల్, ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్సు కోర్సులలో అవకాశాలు లభిస్తాయి.
రాశిచక్ర అంచనాలు

కుంభం
కుటుంబ, ఆర్థిక పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. పత్రికా సంస్థలలోని వారికి, రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యాజ్యాలు ఉపసంహరించుకుంటారు. ఇంటా బయటా మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి.
రాశిచక్ర అంచనాలు

మీనం
స్త్రీలకు అయిన వారిని చూడాలనే కోరిక స్ఫురిస్తింది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉన్నతాధికారులకు ఆకస్మిక స్థానచలనంతో పాటు హోదా మార్పు వంటి సూచనలున్నాయి. ఆత్మీయులు, చిన్నపాటి స్నేహితులను కలుసుకుంటారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు.
రాశిచక్ర అంచనాలు