
మకరం
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం కలిసివచ్చే సమయం. మీ తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశాలు లభిస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్నిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగండి. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. అయిన వారితో చర్చలు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను తట్టుకుంటారు. ఉద్యోగస్తుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు హోదా మార్పు.