జాతకం

వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాల స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. సంతానం దూకుడుతనం వివాదాస్పదమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా శ్రమించవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. అకౌంటెంట్లు, రిప్రజెంటేటివ్‌ల ఒత్తిడి, పనిభారం.