జాతకం

కన్య
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు తలపెట్టిన కార్యక్రమం విజయవంతమవుతుంది. పట్టుదలతో శ్రమించి లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. సకాలంలో రుణవాయిదాలు చెల్లించండి. వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. పెట్టిపోతల్లో జాగ్రత్త వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. దూరపు బంధువులతో తరచు సంభాషిస్తుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు, వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ఉపాధ్యాయులకు పనిభారం, విద్యార్థులకు ఏకాగ్రత లోపం. కొత్త వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు.