జాతకం

కన్య
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు గ్రహబలం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. ఆశావహదృక్పథంతో మెలగండి. కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితుల సాయంతో అవసరాలు నెరవేరుతాయి. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అవివాహితులకు శుభయోగం. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయెద్దు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పత్రాలలో మార్పుచేర్పులు సాధ్యపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. తరుచు విందులు, వేడుకల్లో పాల్గొంటారు.