జాతకం

మీనం
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. ఇంటా బయటా అనుకూలతలున్నాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయన వస్తువుల లభ్యమవుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ ప్రదోన్నతికి అధికారులు తోడ్పాటునందిస్తారు.