జాతకం

కన్య
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. అవివాహితులకు శుభయోగం. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పనిభారం. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు.