జాతకం

మేషం
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ మాసం ప్రతికూలతలు అధికం. సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనసమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. సోదరీ సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. కొన్ని పనులు అర్ధాంతంగా ముగించవలసి వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. సన్నిహితుల ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు. వ్యాపాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, త్రిప్పట అధికం. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.