జాతకం

మేషం
అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ మాసం ద్వితీయార్థం ఆశాజనకం. ఖర్చులు విపరీతం. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితులకు శుభాకాంక్షలు తెలియజేశ్తారు. పదవులు దక్కకపోవచ్చు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. వేడుకలకు సన్నాహులు సాగిస్తారు. దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయ. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. ప్రయాణంలో అవస్థలు తప్పవు.