జాతకం

మేషం
1వ తేదీ బుధుడు ధనస్సు నందు, 1వ తేదీ శుక్రుడు వృశ్చికం నందు, 14వ తేదీ రవి మకరం నందు, 20వ తేదీ బుధుడు మకరం నందు, 29 తేదీ శుక్రుడు ధనస్సు నందు ప్రవేశం. 2వ తేదీన శనిత్రయోదశి, 3న మాస శివరాత్రి, 12న రథసప్తమి. 16వ తేదీన అంతర్వేది తీర్థం. వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించిన శుభం కలుగుతుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా అధికమవుతాయి. ధరలు పెరుగుతాయి. మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ మాసం అనుకూలదాయకమే. ఆర్థికస్థితి సంతృప్తికరం. రుణ బాధలు తొలగి కుదుటపడుతారు. పెట్టుబడులకు అనుకూలం. గృహం సందడిగా ఉంటుంది. బాధ్యతలు అధికమవుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు పనిభారం, ఒత్తిళ్లతో మనస్థిమితం ఉండదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.