జాతకం

మేషం
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ మాసం అన్నిరంగాల వారికి యోగదాయకమే. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలుగుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. సంతానం భవిష్యత్తును వారి ఇష్టానికి వదిలేయండి. పనులు సానుకూలమవుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించే ఆస్కారం ఉంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి నెలకొంటుంది. దైవకార్యాలకు సాయం అందిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం.