జాతకం

మేషం
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ మాసం ప్రథమార్ధం ఏమంత అనుకూలం కాదు. సన్నిహితులు దూరమవుతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణ ఒత్తిళ్ళు ఎదుర్కుంటారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబ విషయాలపై దృష్టి పెడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. సంప్రదింపులకు అనుకూలం. ఏకపక్ష్యంగా వ్యవహరించవద్దు. పెద్దల సలహా పాటించండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ప్రయాణం తలపెడతారు.