జాతకం

మేషం
మేషరాశి : అశ్విని, భరణి, కృతిక 1వ పాదం. అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనలాభం ఉంది. కొన్ని సమస్యలు తీరుతాయి. గృహంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. మానసికంగా కుదుటపడుతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం విదేశీ చదువులపై దృష్టి పెడతారు. పెట్టుబడులకు సమయం కాదు. ఆరోగ్యం సంతృప్తికరం. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. ఆధ్యాత్మికపట్ల ఆసక్తి నెలకొంటుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. అపరిచితులను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాల సమీక్షించుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.