జాతకం

మేషం
మేష రాశి : అశ్విని, భరణి, కృతిక 1వ పాదం ఈ మాసం ఆశాజనకం. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. చెల్లింపుల్లో మెలకువ వహించండి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తికాగలవు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. నిర్మాణాలు ఊపందుకుంటాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.