జాతకం

మేషం
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ మాసం ప్రథమార్ధం అనుకూలదాయకమే. ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు అధికం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పదవీ బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ద్వితీయార్ధంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. భూ సంబంధిత వివాదాలు నిరుత్సాహపరుస్తాయి. 25, 6, 12, 14, 16, 19, 20, 22, 24, 27, 29 తేదీలలో పురోభివృద్ధి. 4, 7, 9, 10, 11, 13, 15, 17, 23, 25, 26 తేదీలలో అప్రమత్తంగా ఉండాలి.