జాతకం

మకరం
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మీదైన రంగంలో విశేష ఫలితాలున్నాయి. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయ. వ్యూహాత్మకంగా అడుగులేయండి. సమయస్ఫూర్తితో రావలసిన ధనం వసూలు చేసుకోవాలి. ఆత్మీయుల కోసం విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివవ్వద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఒక నష్టాన్ని మరోవిధంగా భర్తీ చేసుకుంటారు.