జాతకం

మకరం
ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. సంప్రదింపులు అనుకూలం. ఆదాయం బాగుంటుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులు కృషి ఫలిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.