జాతకం

మకరం
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకలు, శుభకార్యాన్ని ఆడంబరంగా పూర్తిచేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపకాలు, పరిచయాలు బలపడుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ధనప్రలోభం, ఒత్తిళ్లకు లొంగవద్దు. అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.