జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆశ్చర్యకరమైన ఫలితాలు తెలుసుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక సన్నిహితులకు సంతృప్తినిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. విద్యాప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. విద్యాప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి్ కలుగుతుంది. ప్రయాణంలో అవస్థలు తప్పవు. పందాలకు దూరంగా ఉండాలి.