జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ మాసం ఆశాజనకమే. బంధుత్వాలు బలపడతాయి. గృహమార్పు కలిసివస్తుంది. వివాహ యత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పరిచయాలు, చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బాధ్యతలు అధికమవుతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు స్థానలచలనం. ఉన్నతాధికారులకు వీడ్కోలు పలుకుతారు.