జాతకం

మకరం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. దాయం సంతృప్తికరం, రుణ విముక్తి, కొత్త రుణాలు మంజూరవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు అదనపు బాధ్యతలు, విశ్రాంతి లోపం, వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దైవకార్యాలు, విందుల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు, నగదు, పత్రాలు జాగ్రత్త. విద్యార్థులకు విదేశీ చదువులు అనుకూలిస్తాయి. వివాదాలు కొలిక్కి వస్తాయి. మానసిక ప్రశాంతతకు అమ్మవారిని పారిజాతం, తెల్లనిపూలతో పూజించండి.