జాతకం

మకరం
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టిపెడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. సంప్రదింపులు ఫలించవు. సహాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. నోటీసులు అందుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సన్నిహితుల సలహా పాటిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. దీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులుంటాయి. ప్రస్తుత వ్యపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు అదనపు బాధ్యతలు. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం.