జాతకం

కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ప్రేమానుబంధాలు బలపడతాయి. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సంతానసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచికే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు, టెండర్లు దక్కించుకుంటారు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.