జాతకం

కుంభం
ధనిష్ట 3, 4 పాదాుల, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధ్యాయులు శ్రమ ఫలిస్తుంది. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి. చిన్నతరహా పరశ్రమలకు ప్రోత్సాహకరం. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. ప్రయాణంలో జాగ్రత్త.