జాతకం

కుంభం
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అనుకూల ఫలితాలున్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. మీ నమ్మకం వమ్ముకాదు. వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతాన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. బాధ్యతలు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. చర్చలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు.