జాతకం

కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభద్ర 1, 2, 3 పాదాలు. ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. కొత్త సమస్యలు తలెత్తే సుచనలున్నాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు విపరీతం. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. బంధువుల వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. దైవకార్యాల్లో పాల్గొంటారు.