
మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం ప్రథమార్థం అనుకూలం కాదు. కీలక అంశాల్లో ఉత్సాహం తగ్గకుండా మెలగండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా ఖర్చు చేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించండి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికి మాటికి చికాకుపడతారు. ఆత్మీయుల హితవు మీపై సత్ ప్రభావ చూపుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాక్చాతుర్యంతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన బదిలీ. అధికారులకు అదనపు బాధ్యతలు. ఏకాగ్రతతో వాహనం నడపండి.