జాతకం

మీనం
పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఈ మాసం శుభదాయకం. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవివాహితుల ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యం సంతృప్తికరం. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. పెట్టుబడులు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ధనయోగం, పదోన్నతి. దైవదర్శనం సంతృప్తినిస్తుంది. క్రీడా పోటీల్లో రాణిస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరం.