జాతకం

మీనం
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ప్రథమార్ధం ఆశాజనకం. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పనులు సకాలంలో పూర్తికాగలవు. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతప్తికరం. బంధుత్వాలు, పరిచయాలు బలపడుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.