జాతకం

మీనం
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆశావాహ దృక్పథంతో మెలగండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతితో ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. శంకుస్థాపనలు, గృహప్రవేశాలకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.