జాతకం

మీనం
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్రరాబాద్ర, రేవతి ఈ మాసం ద్వితీయార్థం ఆశాజనకం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాందిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యవహారానుకూలతకు విశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. అవకాశాలను తక్షణం వినియోగించండి. ప్రశాంతత, వాహనం యోగం ఉన్నాయి. వాగ్ధాటితో రాణిస్తారు. ఆత్మీయుల సాలహా అనుకూలిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. కొత్త పరిచయాలేర్పడుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.