జాతకం

మీనం
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి అన్నిరంగాలవారికి యోగదాయకమే. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు ధనం అందుతుంది. పెట్టుబడులకు అనుకూలం. గృహం సందడిగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనులు స్పురిస్తాయి. వ్యవహారానుకూలతలున్నాయి. అనుకున్నది సాధిస్తారు. మొండిబాకీలు వసూలు కాగలవు. సంతానం దూకుడును అదుపు చేయండి. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త పనులు ప్రారంభిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఆటంకాలను అధికమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. జూదాల జోలికి పోవద్దు.