జాతకం

మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి. సంప్రదింపులకు అనుకూలం. వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆదాయం బాగుంటుంది. రుణ సమస్యలు నుంచి విముక్తులవుతారు. ఖర్చుల సామాన్యం. దైవకార్యాలకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహం సందడిగా ఉంటుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. అధికారులకు హోదా, మార్పు, స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.